18-12-2016
ఈయన ఎవరోకాదు లోకరక్షకుడు . ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నా పాపందేవుడు మానవుడిగా మారడం మహా అద్భుతం ఇది మానవుడు సృష్టించినది కాదు. దేవుడే సృష్టించిన వింత . వింతలకు వింత. ఖగోళశాస్త్రజ్ఞుల ఊహలకందని మహాద్భుతం యేసుక్రీస్తు జన్మ. యేసుక్రీస్తు జననం అర్ధం లేని జననం కాదు. ఇది అర్థవంతమైన జననం. అంతే యేసుక్రీస్తు మరణం కూడా అర్థవంతమైనది. దేవుడు మనిషిగా పుట్టాడు ఇదే క్రిస్మస్ పండుగ. 1. ఈయన నిజముగా లోకరక్షకుడు నుండి శాపము నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడని నీవు నమ్మితే ఇది నీకు నిజమైన క్రిస్మస్. నీవు నమ్మితే నిజమైన క్రిస్మస్ ఆనందించుతావు. రక్షకుడుగా ఈయన చేసిన ప్రాముఖ్య విషయాలు లూకా 1 ; 79చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారికి ఆయన అరుణోదయము అనుగ్రహించెను. చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారిని వెలిగించుటకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అరుణోదయము అంటే ఉదయించే సూర్యుడు. యేసుక్రీస్తు జననంఈలోకానికి అరుణోదయ దర్శనం. చీకటి అంటే సైతాను చీకటి అంటే పాపానికి సంకేతం చీకటి అంటే శాపానికి సంకేతం చీకటి అంటే నిరాశకు సంకేతం పాపములో శాపములో నిరాశలో కృంగిన వారికీ వెలుగిచ్చుటకు లోక రక్షకుడు అవతరించాడు. వెలుగు అనేది దేవునికి సంకేతం వెలుగు అనేది పరిశుద్ధతకు సంకేతం వెలుగు అనేది ఆనందానికి సంకేతంనీ జీవితాన్ని వెలిగించుటకు లోకరక్షకుడుగా నీ కొరకు పుట్టినాడు. లూకా 1;75 ( 13వ లైన్ )మన జీవితకాలమంతా నిర్భయంగా బ్రతకడం కోసం ఈ రోజులలో ఏదో ఒక భయంలో బ్రతుకుతున్నాడు. భయపడుతూ బ్రతుకుతున్నారు. పూర్వకాలంలో క్రూరమృగాలు అంటే మనుషులకు భయం. పూర్వకాలంలోవిషపు పురుగులంటే మనుషులకు భయం. ఈ రోజులలో మనుషులు ఒకరినొకరు చూసి భయపడుతున్నారు. ఇది ధనవత్వం కాదు మానవత్వం. నీవు జయించాలంటే ప్రేమతోనే జయించాలి. ఎవరికైనా మేలు చేయీ కీడు చేయకు యేసుక్రీస్తు ఈలోకాన్ని జయించాడు. మనుషులు నిర్భయంగా బ్రతకాలి. పిరికివారు దేవుని రాజ్యంలో చేరారు. ధైర్యంగా ఉన్నవారు సింహం వలే వుంటారు. లూకా 1; 79 (3వ లైన్ )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment