18-12-2016

మా మట్టుకు మేము  విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. యోహాను 4 : 42

  

ఈయన ఎవరోకాదు లోకరక్షకుడు . ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నా పాపందేవుడు మానవుడిగా మారడం మహా అద్భుతం ఇది మానవుడు సృష్టించినది కాదు. దేవుడే సృష్టించిన వింత . వింతలకు వింత. ఖగోళశాస్త్రజ్ఞుల ఊహలకందని మహాద్భుతం యేసుక్రీస్తు జన్మ.  యేసుక్రీస్తు జననం అర్ధం లేని జననం కాదు. ఇది అర్థవంతమైన జననం. అంతే యేసుక్రీస్తు మరణం కూడా అర్థవంతమైనది. దేవుడు మనిషిగా పుట్టాడు ఇదే క్రిస్మస్ పండుగ. 1. ఈయన నిజముగా లోకరక్షకుడు  నుండి శాపము నుండి రక్షించడానికి  వచ్చిన రక్షకుడని  నీవు నమ్మితే ఇది  నీకు నిజమైన క్రిస్మస్. నీవు నమ్మితే నిజమైన క్రిస్మస్ ఆనందించుతావు. రక్షకుడుగా ఈయన చేసిన ప్రాముఖ్య విషయాలు లూకా  1 ; 79చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారికి ఆయన అరుణోదయము అనుగ్రహించెను.  చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారిని వెలిగించుటకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అరుణోదయము అంటే ఉదయించే సూర్యుడు. యేసుక్రీస్తు జననంఈలోకానికి అరుణోదయ దర్శనం. చీకటి అంటే సైతాను చీకటి అంటే పాపానికి సంకేతం చీకటి అంటే శాపానికి సంకేతం చీకటి అంటే నిరాశకు సంకేతం పాపములో శాపములో నిరాశలో కృంగిన వారికీ వెలుగిచ్చుటకు లోక రక్షకుడు అవతరించాడు. వెలుగు అనేది దేవునికి సంకేతం వెలుగు అనేది పరిశుద్ధతకు సంకేతం వెలుగు అనేది ఆనందానికి సంకేతంనీ జీవితాన్ని వెలిగించుటకు లోకరక్షకుడుగా నీ కొరకు పుట్టినాడు. లూకా  1;75  ( 13వ లైన్  )మన జీవితకాలమంతా నిర్భయంగా బ్రతకడం కోసం ఈ రోజులలో ఏదో ఒక భయంలో బ్రతుకుతున్నాడు. భయపడుతూ బ్రతుకుతున్నారు. పూర్వకాలంలో క్రూరమృగాలు అంటే మనుషులకు భయం. పూర్వకాలంలోవిషపు పురుగులంటే మనుషులకు భయం. ఈ రోజులలో మనుషులు ఒకరినొకరు చూసి భయపడుతున్నారు. ఇది ధనవత్వం కాదు మానవత్వం. నీవు జయించాలంటే ప్రేమతోనే జయించాలి. ఎవరికైనా మేలు చేయీ కీడు చేయకు యేసుక్రీస్తు ఈలోకాన్ని జయించాడు. మనుషులు నిర్భయంగా బ్రతకాలి. పిరికివారు దేవుని రాజ్యంలో  చేరారు. ధైర్యంగా ఉన్నవారు  సింహం వలే వుంటారు. లూకా  1; 79 (3వ లైన్ )
సమాధానంగా బ్రతకడం కోసం మత్తయి 11: 28నేను మీకు శాంతినిస్తాను. శాంతిగా, ప్రశాంతంగా బ్రతకాలి. యెషయా 9: 6సమాధాన అధిపతి ఎవరో కాదు . ఒక పశువుల తొట్టిలో పరుండపెట్టబడిన  యేసుక్రీస్తు. సమరయులు ,అంటరానివారు నమ్మినారు. మా దగ్గరలో వుండు ప్రభువా అని వేడుకున్నారు. అదే వారికీ నిజమైన క్రిస్మస్ . మనలను సమాధానంగా నడిపించుటకు ఈ లోకంలో జన్మించిన నిజమైన రక్షకుడు.      2. మనం నిర్భయంగా బ్రతకడం కోసం. 3. సమాధాన మార్గంలో నడుచుట.


యేసుక్రీస్తును ఎరుగుటయే నిజమైన క్రిస్టమస్

'అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'      యోహాను 17:3 



క్రిస్మస్ అంటే ఒక అనుభూతి 

అనుభూతిని అనుభవించాలి గాని దానిని గురుంచి వివరించా కూడదు . బయటకి చెప్పటం 

HARVEST FESTIVAL

             ప్రభువు మెచ్చుకొను అర్పణ  

" ఆయన (యేసు) కానుకపెట్టె యెదుట కూర్చుండి. జనసమూహము కానుకపెట్టెలో డబ్బు వేయుట చూచుచుండెను . "        మార్కు 12 : 41       

దేవునికి ఇవ్వడం లేక అర్పణ చెల్లించడం అనేది దేవుని కృప అని 2కోరింతి 8:1 లో పరిశుద్దుడైన పౌలు స్పష్టంగా తెలియజేసాడు. దేవునికి అర్పణ అర్పించడమంటే పరిశుద్దుల పరిచర్యలో పాలుపొందుట అని  2కోరింతి 9:1లో వ్రాయబడివుంది . దేవునికి   అర్పణ చెల్లించడమంటే పరలోకంలో ధనం కూర్చుకోవడం అని అర్ధం.                                                                                       
సాధారణంగా అర్పణలు చెల్లించే పద్ధతులు 6 విధాలుగా ఉన్నాయి.

  1. గొప్పతనం కోసం దేవునికి ఇవ్వడం (కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు)
  2. కోపముతో ఇవ్వడం (తప్పదు కనుక అని దేవునికి అర్పణలు ఇవ్వడం )
  3. అయిష్టములో ఇవ్వడం దేవునికి అర్పణ ఇష్టంతో ఇవ్వాలి . 
  4. దేవుని నుండి ఏదో (ప్రతిఫలం ఆశించి అర్పణలు ఇవ్వడం )
  5. దేవుని పట్ల ప్రేమతో ఇవ్వడం. (సణగుకోకుండా ఇవ్వడం )
  6. సంతోషముతో ఇవ్వడం (ఉత్సాహముగా ఇచ్చే వారిని దేవుడు ఎంతో ప్రేమించును )  

                      నీ అర్పణ ఎలావుంది ?

1. దేవుని నమ్మి ఇచ్చే అర్పణ.     రోమా 4 : 38 ,  గలతి 3 : 6

విధవరాలు కానుక అర్పించింది. కానుక చాలా చిన్నది. రెండు కాసులు మాత్రమే కాని అర్పణ ప్రభువు మెచ్చుకున్నాడు. ప్రభువుకు ఇష్టమైoది. కారణం ఆ బీద విధవరాలు దేవుని నమ్మింది అబ్రహాము దేవుని నమ్మెను కనుక తన ఒక్కగానొక్క కుమారుని దేవుని అర్పించుటకు వెనుతియలేదు. నీవు దేవునికి అర్పణ అర్పించేటప్పుడు ఆ అర్పణ దేవునికి ఇష్టమైన అర్పణగా ఉంటుంది.

2. దేవుని ప్రేమించి అర్పించే అర్పణ.   యోహాను 14 : 23

ఈ బీద విధవరాలు దేవుని ప్రేమించిన స్త్రీ దేవుని ప్రేమించడమంటే మాటలు చెప్పడము కాదు, దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞనుగైకొనుట నీవు ఎంత అర్పణ అర్పించావు అనే దానికంటే నీవు నిజముగా దేవుని ప్రేమించుచున్నావా అనేది చాలా ముఖ్యం దేవుని ప్రేమించే వారికీ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. రోమ. 8:28 , దేవుని ప్రేమించువాడు దేవుని కొరకు ప్రాణమైనా ఇస్తాడు.

3. దాతృత్వముతో అర్పించే అర్పణ.    2కోరింతి  9 : 2

ఈ బీద విధవరాలు సిద్దమనస్సుతో అర్పణ అర్పించింది. ఎంతోమంది ధనవంతులు ఎంతో ధనం అర్పిస్తున్నారు. వారంతా వారికున్నదానిలో కొంత అర్పించారు. ఈ బీద విధవరాలు ఉన్నదంతా ఇచ్చింది. దాతృత్వము గల మనస్సు గల స్త్రీ దేవునికి అర్పణ అర్పించేటప్పుడు సిద్దమనస్సుతో ఇవ్వాలి. అది దేవునికి ఎంతో ప్రీతికరమగును. దేవునికి ఇవ్వండి దేవుని నుండి సమృద్దిగా పొందుకొండి.
  

CHURCH VIDEO







CHRISTMAS




          క్రీస్తు అనబడిన యేసు పుట్టెను 


    "ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను"            మత్తయి 1: 16



లోకరక్షకుడు పరిశుద్దుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, దీవెనలు We wish you a Merry Chritmas మీకు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు . క్రిస్మస్ ఆచారంగా ఆర్బాటంగా జరుపుకునే వేడుకగా కాక ఆత్మ సంబందమైన ఆరాధనగా ఉండాలి క్రిస్మస్ అంటే దేవుడు మానవుడిగా పుట్టడం.  దేవుడు మానవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అసలు ఈ క్రీస్తు అనబడిన యేసు ఎవరు? నాలుగు ప్రాముఖ్య విషయాలను చూద్దాము.

1. యేసు నిజమైన దేవుడు. Jesus is true God     1యోహాను 1 : 20

"మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన  యేసుక్రీస్తునందున్నావారమై సత్యవంతుని యందున్నాము  ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమై యున్నాడు.
మానవులందరు నిజదేవుని అన్వేషణలో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరు? అని తెలుసుకోడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కన్య మరియ గర్భాన ఉద్బవించిన క్రీస్తు అనబడిన క్రీస్తు ఎవరో కాదు నిజమైన దేవుడు.
 నిజమైన దేవుని ఆత్మతో అరదించడమే నిజమైన క్రిస్మస్.

2. యేసు మహా దేవుడు.         Jesus is Great God          తీతు 2 ; 13

"అనగా మహా దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకము స్వస్థ బుద్దితోను, బ్రతుకుచుండవలెనని బోదించుచున్నది. 
మహాదేవుడు అంటే దేవుళ్ళకు దేవతంలందరికి ఫైనున్న అని అర్ధం అందరి కంటే గొప్ప మహాత్యము గలవాడని అర్ధం, భూమిని పాదపీటముగా,ఆకాశమును సింహాసనుముగా చేసికొని ఈ భూమండలమంత పట్టజాలనంత  మహాదేవుడు పవిత్రుడుగా జన్మించిన క్రీస్తు అనబడిన ఈ యేసు ఎవరో కాదు మహాదేవుడు మహాదేవుని జననమే క్రిస్మస్.

3. యేసు బలవంతుడైన దేవుడు.      Jesus is Mighty God        యెషయ 6 : 9

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును.బలవంతుడంటే అసాధ్యాలను సుసాధ్యము చేయగల దేవుడు ఏదైనా చేయుటకు శక్తి గల దేవుడని అర్ధం. ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా కాపాడగలిగిన దేవుడు. క్రీస్తు అనబడిన యేసు ఎవరో కాదు. బలవంతుడైన దేవుని జననమే క్రిస్మస్. 

4. యేసు సర్వాధికారియైన దేవుడు.       Powerful God       ప్రకటన 11 : 17

వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నేవు మహాబలమును స్వీకరించి యేలుచున్నావు. గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పరలోకమందు భూలోకమందు సర్వాధికారముగల ఏకైక సత్యదేవుడు క్రీస్తు అనబడిన యేసు సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు, పాప పరిహారము చేయడము కొరకు ప్రాణాన్ని అర్పించిన ప్రాయచిత్తము చేసిన ఏకైక సత్యదేవుడు యేసుక్రీస్తు ఆయనను ఆరాదించువారు ధన్యులు. 

EASTER

  క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు 

" ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రధమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపపడి యున్నాడు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రధమ ఫలము క్రీస్తు "      కోరింతి 15 ; 20

                     పునరుత్థానములో దాగియున్న మేళ్ళు 


1.  పునరుత్థానము మన విశ్వాసానికి పునాది .    1 కోరింతి 15 ; 17 

"క్రీస్తు లేపబడని యెడల మా విశ్వాసము వ్యర్ధమే "
 యేసు  పునరుత్థానము వాస్తవమా ? నిజంగా యేసు  మృతులలో నుండి లేచాడా ? ఈ ప్రశ్నలు నేటికి ఉన్నాయి .
  పునరుత్థానుడైన ప్రభువు నేటికి మనతో మాట్లాడుచు, మనతో వుంటూ , కార్యములు జరిగించుచున్నప్పటికి మనం కూడా ఎన్నోమారులు అవిశ్వాసులుగా ప్రవర్తిస్తున్నాము . యేసు తన్ను  తను అనేక పర్యాయములు ప్రత్యక్షపరుచుకొని పలురీతులుగా ఆయా వ్యక్తులను బట్టి ఆయా పరిస్థితులను బట్టి ప్రతి వారిలో విశ్వాసమును కలిగించువాడు   యేసు  పునరుత్థానము మన విశ్వాసానికి పునాది .

2.  పునరుత్థానము విశ్వాసాకి శుభప్రధమైన నిరీక్షణ.      1 థెస్స 4 : 14

"యేసు చనిపోయి మళ్లీ సజీవంగా లేచాడని మనము నమ్మినయెడల ఆప్రకారమే యేసులో నిద్రించిన వారిని ఆయనతో కూడా దేవుడు తీసుకవస్తాడు. అంటే అందరం మరణిస్తాం మరలా లేస్తాం మహిమ శరీరాలు దరించుకొంటాం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము అనే నిరీక్షణ ఈ నిరీక్షణ శుభప్రధమైనది పునరుత్థానుడైన యేసులో లభించింది.

3.  పునరుత్థానములో  విశ్వాసాకి సమాధానము.     యోహాను  20 ; 19,20

"శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసికొనివున్నను వారికి  ప్రత్యక్షమై రెండు సార్లు సమాధానము ప్రకటించాడు . సమాధానలేమి వలన అశాంతికి గురైనా వారికి యేసు సమాధానమిచ్చి దృడపరిచాడు.

" శాంతిని మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను."   యోహాను 14 : 27